Skip to main content

Big Breaking Tomorrow Holiday : రేపు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. కార‌ణం ఇదే..!

ప్ర‌భుత్వం విద్యాసంస్థ‌ల‌కు మ‌రో సెల‌వు ప్ర‌క‌టన ఇచ్చింది.
Educational institutions in Karnataka closed tomorrow due to SM Krishnas demise  Karnataka govt declares holiday tomorrow   Announcement of a holiday for educational institutions

సాక్షి ఎడ్యుకేష‌న్: గ‌త కొంత‌కాలంగా విద్యార్థులు ఎక్కువ‌గా వింటున్న ప్ర‌క‌ట‌న‌లు సెల‌వుల గురించే.. కొన్ని రోజులుగా తీవ్ర వ‌ర్షాల కార‌ణంగా, చ‌లి తీవ్ర‌త కార‌ణంగా, బంద్‌ల వంటి వివిధ కార‌ణాలతో ప్ర‌భుత్వం విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది. అంతేకాకుండా, కొన్ని పండుగ‌ల‌కు కూడా సెల‌వులు వ‌స్తూనే ఉన్నాయి. ఇలా, వ‌రుస‌గా వారంలో ఒక్క‌సారైనా సెలవుల ప్ర‌క‌ట‌న వింటున్న సంగ‌తి తెలిసిందే.

సెల‌వుకు కారణం...

తాజాగా, నేడు ప్ర‌భుత్వం నుంచి మ‌రో సెల‌వు వార్త వ‌చ్చింది. రేపు అన్ని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, క‌ర్ణాట‌కా మాజీ ముఖ్యమంత్రి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ నేడు తెల్ల‌వారు జాము 2:30 గంట‌ల‌కు క‌న్నుమూశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ఆయ‌న వ‌య‌సు 92 సంవ‌త్స‌రాలు. దీంతో రేపు క‌ర్ణాట‌క‌లోని ప్ర‌తీ విద్యాసంస్థకి సెల‌వు అని ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం.

SM Krishna Death: మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత

బెంగళూరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం, ఆయన స్వగ్రామం- మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా పరిధిలో గల సోమణహళ్లిలో అంత్యక్రియలను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వ‌హించ‌నున్నారు.

కుటుంబానికి సంతాపం

ఎస్ఎం కృష్ణ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధితనే మల్లికార్జున్ ఖర్గే, పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. సేవలను స్మరించుకున్నారు.

Apprenticeship: అప్రంటీస్‌ మేళాకు 43 మంది ఎంపిక

మూడురోజుపాటు..

ఆయన మృతి పట్ల మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటించనుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ఉప ప్రధాన కార్యదర్శి ఎలీషా ఆండ్రూస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు రోజుల పాటు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, ఉత్సవాలు, వేడుకలను నిర్వహించకూడదని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

బుధవారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్ఎం కృష్ణ పార్థివదేహానికి అంత్యక్రియలను నిర్వహించనున్న నేపథ్యంలో సెలవును ప్రకటించింది క‌ర్ణాట‌క‌ ప్రభుత్వం. సంతాప సూచకంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సెల‌వు ఉంటుంది. 

NIT Warangal Recruitment: నిట్‌ వరంగల్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. అర్హత, ఇత‌ర వివరాలు..

రాజ‌కీయ ప్రయాణం..

ఆయన పూర్తి పేరు సోమణహళ్లి మల్లయ్య కృష్ణ. 1932 మే 1వ తేదీన మండ్య జిల్లాలోని సోమణహళ్లిలో జన్మించారు. 1960లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1962లో మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1968 నాటి లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి గెలిచారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

క్రమంగా, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ కాలంలోనే బెంగళూరు సిలికాన్ సిటీగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఐటీ హబ్‌గా, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కేంద్రబిందువుగా రూపాంతంరం చెందింది.

Mother and Daughters : స్టేజీపై స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన త‌ల్లీ కూతుర్లు..

2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. 2017లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

Published date : 10 Dec 2024 03:04PM

Photo Stories