Tuhin Kanta Pandey: రెవెన్యూ కార్యదర్శిగా తుహిన్ కాంత పాండే
జనవరి 8వ తేదీ మంత్రి వర్గ నియామక కమిటీ ఆయనను రెవెన్యూ కార్యదర్శిగా నియమించింది.
ఇప్పటివరకు పాండే.. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్), ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఆర్థిక కార్యదర్శిగా కూడా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొనబడింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఆయనను ఆర్థిక కార్యదర్శిగా నియమించారు. మంత్రిత్వ శాఖలో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిని ఆర్థిక కార్యదర్శిగా నియమించడం సంప్రదాయం.
పాండే 1987 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి. దీపమ్ కార్యదర్శిగా పనిచేయడానికి ముందు ఆయన కేంద్ర ప్రభుత్వం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆయన, బర్మింగ్‌హామ్ (యూకే) విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
Vinod Chandran: సుప్రీంకోర్టు జడ్జిగా వినోజ్ చంద్రన్
ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆరు ప్రధాన విభాగాలు ఉన్నాయి. అందులో రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలు, వ్యయ, ఆర్థిక సేవలు, దీపమ్, ప్రభుత్వ రంగ సంస్థల విభాగం ఉన్నాయి.