Joseph Aoun: లెబనాన్ నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ ఔన్
Sakshi Education
లెబనాన్ పార్లమెంట్ నూతన అధ్యక్షుడిగా సైనిక కమాండర్ జోసెఫ్ ఔన్ జనవరి 9వ తేదీ ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికతో.. రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న లెబనాన్ అధ్యక్ష పదవికి కొత్త వ్యక్తి ఎంపికయ్యారు. గత కొద్దిపాటి వారాల్లో ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య 14 నెలల కాల్పుల ఘర్షణకు ముగింపు పలుకుతూ, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సమయంలో ఈ పదవి భర్తీ అయ్యింది.
2022 నుంచి లెబనాన్ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో, కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి గతంలో 12 సార్లు ప్రయత్నాలు జరిగాయి. 13వ ప్రయత్నంలో లెబనాన్ పార్లమెంటు జోసెఫ్ ఔన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
గతంలో సులేమాన్ ఫ్రాంగీకి హెజ్‌బొల్లా మద్దతు పొందిన వ్యక్తిగా ఉన్నారు. ఇతనికి సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌తో దగ్గరి సంబంధాలు ఉండడంతో, ఫ్రాంగీ రేసు నుంచి వైదొలగి జోసెఫ్ ఔన్‌కు మద్దతు ఇవ్వడం జరిగింది.
Jeetendra Mishra: ఎయిర్ కమాండ్ విభాగం కమాండర్‌గా జితేంద్ర మిశ్ర
Published date : 10 Jan 2025 05:30PM