Justice Srikrishna: ఫైనాన్స్ కంపెనీ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా జస్టిస్ శ్రీకృష్ణ
Sakshi Education
డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం ఈక్వల్, అలాగే ఆ సంస్థ పెట్టుబడులున్న అకౌంట్ అగ్రిగేటర్ వన్‌మనీ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నియమితులయ్యారు.
న్యాయశాస్త్ర, ఆర్థిక, టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు జగదీష్ కపూర్, రాకేష్ మోహన్.. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జే సత్యనారాయణ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.
డేటా షేరింగ్‌కి సంబంధించి భద్రత, నైతికతకు ప్రాధాన్యమిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ఇరు కంపెనీలకు ఈ బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. వ్యక్తుల హక్కులు, ఆకాంక్షలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాల్లో సమతౌల్యత పాటించేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ తెలిపారు.
Vaibhav Krishna: మహాకుంభమేళా భద్రతా బాధ్యతల అధికారిగా వైభవ్ కృష్ణ.. ఆయన ఎవరు?
Published date : 10 Jan 2025 06:43PM