Vinod Chandran: సుప్రీంకోర్టు జడ్జిగా వినోజ్ చంద్రన్
కేరళ హైకోర్టులో నవంబర్ 8, 2011లో జడ్జిగా నియమితులైన వినోద్ చంద్రన్‌కు సర్వోన్నత న్యాయస్థానానికి పదోన్నతి కల్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలిజియం సిఫారసు చేసింది.
చంద్రన్ మార్చి 29, 2023న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 33కు చేరనుంది. మంజూరైన పోస్టులు 34 కాగా జస్టిస్ సి.టి.రవికుమార్ ఈ నెల 3న పదవీ విరమణ చేశారు.
అఖిల భారత స్థాయిలో హైకోర్టుల జడ్జిల్లో వినోద్ చంద్రన్ 13వ స్థానంలో ఉన్నప్పటికీ.. కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆయన్ను కొలీజియం ఎంపిక చేసింది.
అలాగే.. బాంబే హైకోర్టు న్యాయమూర్తి దేవంద్ర కుమార్ ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేసింది.