V Narayanan: ఇస్రో నూతన చీఫ్‌గా డాక్టర్ నారాయణన్
ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఇస్రో తదుపరి చైర్మన్‌గా వి.నారాయణన్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పదవీకాలం ముగుస్తుండటంతో జనవరి 14వ తేదీ నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, నారాయణన్ రెండేళ్ల పాటు ఇస్రో చైర్మన్‌గా బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్‌పీఎస్‌సీ) డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాకెట్ వ్యవస్థ, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్‌కు సంబంధించి నాలుగు దశాబ్దాలుగా పలు హోదాల్లో ఆయన పనిచేస్తున్నారు.
Vaibhav Krishna: మహాకుంభమేళా భద్రతా బాధ్యతల అధికారిగా వైభవ్ కృష్ణ.. ఆయన ఎవరు?
నారాయణన్.. స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి. ఖరగ్‌పూర్ ఐఐటీలో క్రయోజనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌తో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఎంటెక్‌లో మొదటి ర్యాంక్ సాధించినందుకు అతనికి సిల్వర్ మెడల్ లభించింది. 2001లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
ఇక నారాయణన్ 1984లో ఆయన ఇస్రోలో చేరారు. 2018లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయనకు రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ చోదక వ్యవస్థల్లో అపార అనుభవం ఉంది. ఆయన ద్రవ, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్ చోదక వ్యవస్థల అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-2, 3 వాహకనౌకల రూపకల్పనలో కీలకభూమిక వహించారు. ఆదిత్య-ఎల్1, చంద్రయాన్-2, చంద్రయాన్-3లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి కూడా కృషి చేశారు.
Jeetendra Mishra: ఎయిర్ కమాండ్ విభాగం కమాండర్‌గా జితేంద్ర మిశ్ర