Cherlapally Terminal: తెలంగాణ, జమ్మూకశ్మీర్, ఒడిశాల్లో రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం
జమ్మూకశ్మీర్, తెలంగాణ, ఒడిశాలో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభంతో పర్యాటకం మరింత పెరుగుతుందని, ఈ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణలోని చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్ ద్వారా ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే కొత్త మౌలిక సదుపాయాలున్నాయన్నారు. ఈ స్టేషన్‌ను ఔటర్ రింగ్ రోడ్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని మోదీ ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడల రైల్వే స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అనుభవం కలిగిస్తుందని అన్నారు.
PM Modi: స్వల్పకాలంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించిన ప్రధాని మోదీ
చర్లపల్లి స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, సౌరశక్తి ఆధారిత కార్యకలాపాలతో ఆధునిక సౌకర్యాలను సృష్టించడం పెద్ద ముందడుగు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారాన్ని సులభతరం చేయడంలో కీలకంగా ఉంటాయని ప్రధాని తెలిపారు.
త్వరలోనే తొలి బుల్లెట్ రైలు
వందేభారత్ స్లీపర్ రైలు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నట్లు ప్రధాని చెప్పారు. ఇది భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రవేశపెట్టే దిశలో మొదటి అడుగు అని పేర్కొన్నారు.
విమానాశ్రయాలు, మెట్రో సేవలు అభివృద్ధి, పలుకుబడి నైపుణ్యాలు పెరిగి, దేశం అంచెలంచెలుగా ప్రగతి దిశగా ముందుకు సాగుతుందని మోదీ చెప్పారు. 2014లో 74 విమానాశ్రయాలు ఉన్నాయంటే, ఇప్పుడు 150కి పైగా ఉన్నాయని తెలిపారు. 5 నగరాల నుంచి 21 నగరాలకు మెట్రో సేవలు విస్తరించడంతో మౌలిక అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని చెప్పారు.
S-VYASA University: ఎస్-వ్యాస కొత్త క్యాంపస్ ప్రారంభం.. ఎక్కడంటే..