Microsoft: భారత్‌లో మైక్రోసాఫ్ట్ 2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్.. 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి
దేశంలో క్లౌడ్, కృత్రిమ మేధ సామర్థ్యాలను విస్తరించడం, డేటా సెంటర్ల విస్తరణ కోసం 3 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) వెల్లడించారు. అలాగే, 2030 నాటికి 10 మిలియన్ల మందికి (కోటి మందికి) ఏఐ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బెంగళూరు వేదికగా జనవరి 7వ తేదీ నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు.
బెంగళూరులోని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్‌లో సత్య నాదెళ్ల ఈ భారీ పెట్టుబడి గురించి ప్రకటించారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంత పెద్ద పెట్టుబడిని భారతదేశంలో మునుపెన్నడూ పెట్టలేదు. కానీ టెక్నాలజీ విస్తరణ, ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేసినందుకు, నేను చాలా సంతోషిస్తున్నాను అని సత్య నాదెళ్ళ అన్నారు. అంతే కాకుండా మన దేశంలో కంపెనీ మరింత విస్తరిస్తోంది. ఇది ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.
Maha Kumbh Mela: మహా కుంభమేళాకు ఏర్పాట్లు.. కుంభమేళా అంటే ఏమిటి..? దేశంలో నాలుగు చోట్ల మాత్రమే..!
సత్య నాదెళ్ల భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi)తో తన సమావేశం, అక్కడ చర్చించిన విషయాలను కూడా పంచుకున్నారు. జనవరి 6వ తేదీ ప్రధాని మోదీని కలిసి.. భారతదేశం టెక్ ల్యాండ్‌స్కేప్ కోసం మైక్రోసాఫ్ట్ విజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ, ఏఐ వంటి వాటితో పాటు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను గురించి కూడా చర్చించినట్లు వివరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీలు ఉన్నాయి.
ఇప్పటికే ఏఐను అభివృద్ధి చేయడంలో భాగంగా.. 2024 డిసెంబర్ చివరి రోజుల్లో 10 శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఏఐ.. ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందని, లెక్కకు మించిన ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదని, ఈ టెక్నాలజీ వారి నైపుణ్యాన్ని పెంచుతుందని వాదించారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఇందులో శిక్షణ పొందుతున్నారు.
మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా.. యువత కూడా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని గత ఏడాది 'నిర్మల సీతారామన్' కూడా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యువత తప్పకుండా.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడైనా మనగలగవచ్చు.
Most Influential People: ‘ఏఐ 2024 అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల’ జాబితాలో టాప్ 10లో ఉన్నది వీరే..