Skip to main content

ISRO: ఈ నెల‌లో 100వ ప్రయోగం చేయ‌నున్న‌ షార్

శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) సెంచరీ కొట్టబోతోంది.
ISRO Announces Milestone 100th Mission

డిసెంబ‌ర్ 30వ తేదీ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక ద్వారా పీఎస్ఎల్‌వీ-సి60 ద్వారా చేసిన స్పేడెక్స్ జంట ఉపగ్రహాలను భూ దిగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ కేంద్రం చరిత్రలో అది 99వ ప్రయోగం. 

ఈ నెల‌లో 100వ ప్రయోగం..
జనవరిలో 100వ ప్రయోగం ద్వారా షార్ మరో మైలురాయిని చేరనుంది. జియో సింక్రనస్ లాంచ్ వెహికిల్ (జీఎస్ఎల్‌వీ) ద్వారా ఎన్వీఎస్-02 ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. 2023 మేలో 2,232 కిలోల ఎన్‌వీఎస్-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్‌వీ రాకెట్ విజయవంతంగా జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆర్బిట్ (జీటీఓ)లోకి ప్రవేశపెట్టింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా పీఎస్ఎల్‌వీ-సి60 ద్వారా ప్రయోగించిన చేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలు 475 కి.మీ. ఎత్తున భూ దిగువ కక్ష్యలో కుదురుకున్నట్టు ఇస్రో వెల్లడించింది.

POEM-4 in PSLV-C60: పీఎస్ఎల్‌వీ సీ60లో పీఎస్-4తో విభిన్న ప్రయోగాలు 

డిసెంబ‌ర్ 31వ తేదీ అవి పరస్పరం సమీపంలో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను దక్షిణ అమెరికాకు చెందిన ఒక ట్రాకింగ్ సైట్ రికార్డు చేసింది. వాటిని అనుసంధానించే కీలకమైన డాకింగ్ ప్రక్రియను జనవరి 7న జరపాలని ఇస్రో భావిస్తోంది. అందులో భాగంగా చేజర్ ఉపగ్రహం 20 కి.మీ. దూరం నుంచి నెమ్మదిగా తోటి ఉపగ్రహం చేజర్‌ను సమీపించి దానితో అనుసంధానమవుతుంది. ప్రయోగం పూర్తయిన వెంటనే తిరిగి దాని నుంచి విడిపోతుంది.

INS Nirdeshak: తీర భద్రతా 'నిర్దేశక్‌'.. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం

Published date : 01 Jan 2025 06:41PM

Photo Stories