Manish Singhal: అసోచామ్ సెక్రటరీ జనరల్‌గా మనీష్ సింఘాల్
Sakshi Education
భారతదేశంలోని పురాతన అపెక్స్ బిజినెస్ ఛాంబర్‌లలో ఒకటైన అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) సెక్రటరీ జనరల్‌గా మనీష్ సింఘాల్ నియమితులయ్యారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఛాంబర్‌ను విజయవంతంగా నడిపించిన దీపక్ సూద్ పదవీ విరమణ చేశారు.
35 సంవత్సరాల అనుభవం ఉన్న మనీష్ సింఘాల్ చాంబర్, కార్పొరేట్ ఇండియా పరిశ్రమల్లో ప్రముఖ నాయకుడిగా వ్యవహరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI)లో డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌గా పనిచేశారు.
అలాగే.. టాటా మోటార్స్, ఐషర్ (వోల్వో), టాటా ఆటో కాంప్ సిస్టమ్స్, మోజర్ బేర్ ఇండియా, బీఈఎంఎల్(BEML) వంటి అనేక ప్రముఖ భారతీయ ట్రాన్స్‌నేషనల్ కంపెనీలతో పనిచేశారు.
NHRC chairperson: ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌గా నియమితులైన రామసుబ్రమణియన్
Published date : 04 Jan 2025 10:17AM