NHRC chairperson: ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌గా నియమితులైన రామసుబ్రమణియన్
ఈ కార్యక్రమం ఢిల్లీలోని మానవాధికార భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ.. మానవ హక్కులు మన దేశంలో సాంస్కృతిక పరంపరలో ఒక అవిభాజ్య భాగంగా ఉంటాయని, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల భావన రాకముందే మన దేశంలో వాటిని పాటించినట్లు చెప్పారు. ఆయన ప్రోత్సహించేందుకు, రక్షించేందుకు సమష్టి కృషి అవసరమని గుర్తు చేశారు.
జస్టిస్ రామసుబ్రమణియన్.. 1958 జూన్ 30న తమిళనాడులోని మన్నార్‌గుడిలో జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రవేశించిన ఆయన 23 ఏళ్ల పాటు మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2006లో మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతిని పొందిన జస్టిస్ రామసుబ్రమణియన్, 2019 సెప్టెంబర్ 23 నుంచి 2023 జూన్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీలోని ఇతర సభ్యులలో ప్రియాంక్ కనూంగో, జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. మరో సభ్యుడు జస్టిస్ బిద్యుత్ రంజన్ షడంగి, ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. 2023లో ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందిన జస్టిస్ షడంగి, ఒడిశా హైకోర్టులో కూడా సేవలు అందించారు.
Madan Lokur: ఐరాస అంతర్గత న్యాయమండలి చైర్‌పర్సన్‌గా జస్టిస్ మదన్ లోకుర్