Skip to main content

Vaishali: ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో వైశాలికి కాంస్య పతకం

ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు కాంస్య పతకాన్ని గెల్చుకుంది.
Vaishali Rameshbabu wins bronze medal at World Blitz Chess Championship

భారత కాలమానం ప్రకారం జ‌న‌వరి 1వ తేదీ ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో 23 ఏళ్ల వైశాలి పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. 
 
చైనా గ్రాండ్‌మాస్టర్‌ జు వెన్‌జున్‌తో జరిగిన సెమీఫైనల్లో తమిళనాడుకు చెందిన వైశాలి 0.5–2.5తో ఓడిపోయింది. మరో సెమీఫైనల్లో లె టింగ్‌జీ (చైనా) 3.5–2.5తో కాటరీనా లాగ్నో (రష్యా)పై గెలిచింది. జు వెన్‌జున్‌తో జరిగిన సెమీఫైనల్‌ తొలి గేమ్‌ను వైశాలి 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. రెండో గేమ్‌లో జు వెన్‌జున్‌ 86 ఎత్తుల్లో.. మూడో గేమ్‌లో 36 ఎత్తుల్లో వైశాలిని ఓడించి 2.5–0.5తో విజయాన్ని ఖరారు చేసుకుంది. 

ఫలితం తేలిపోవడంతో వీరిద్దరి మధ్య నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్లో ఓడిన వైశాలి, కాటరీనా లాగ్నోలకు కాంస్య పతకాలు లభించాయి. ఫైనల్లో వెన్‌జున్‌ 3.5–.2.5తో లె టింగ్‌జీపై గెలిచి తొలిసారి ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌గా అవతరించింది.  

World Blitz Championship: రెండోసారి ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌

➤ ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందింది. 2017లో విశ్వనాథన్‌ ఆనంద్‌ కాంస్య పతకం.. 2022లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి రజత పతకం గెలిచారు. 

Published date : 03 Jan 2025 09:20AM

Photo Stories