Rajagopala Chidambaram: అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న ఆయన జనవరి 4వ తేదీ వేకువజామున కన్నుమూసినట్లు అణుఇంధన శాఖ వెల్లడించింది. దేశానికి సంబంధించిన అణ్వాయుధాల తయారీతో పాటు పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షల్లోనూ ఈయన ఎంతో కీలకంగా వ్యహరించారు.
రాజగోపాల చిదంబరం.. చెన్నైలో జన్మించారు. ఆయన మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌తో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ సాధించారు. 1975లో జరిపిన పోఖ్రాన్ 1, 1998లో నిర్వహించిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో కీలకంగా పనిచేశారు.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) డైరెక్టర్‌గా వ్యవహరించిన చిదంబరం.. అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గానూ సేవలందించారు. ఆపై అణుశక్తి విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ గ్రహీత జిమ్మీ కార్టర్ కన్నుమూత