Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత
జార్జియాలోని ప్లెయిన్స్‌లో జిమ్మీ కార్టర్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు జేమ్స్ కార్టర్ తెలిపారు. జిమ్మీ కార్టర్ 1977 నుంచి 1981 వరకు అమెరికా 39వ అధ్యక్షుడిగా పనిచేశారు.
జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ సంతాపం తెలిపారు. బైడెన్ వ్యాఖ్యానిస్తూ, వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర, మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికలు వంటి వివిధ అంశాల్లో జిమ్మీ కార్టర్ తన అత్యంత గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించారని చెప్పారు. ఈ సందర్భంగా, వైట్ హౌస్ నుంచి అంత్యక్రియల ఏర్పాట్లపై సమాచారం విడుదల చేయబడింది.
జిమ్మీ కార్టర్.. 1924 అక్టోబర్ 1వ తేదీ జన్మించారు. ఆయన డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తిగా 1977 నుంచి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగారు. కార్టర్‌కు 2002లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన అవిశ్రాంత కృషికి గాను శాంతి బహుమతి దక్కింది. ఇక, భారత్‌లో కార్టర్ పర్యటనకు గుర్తుగా హర్యానాలోకి ఓ గ్రామానికి కార్టర్‌పురిగా నామకరణం చేశారు.