Palm Oil: పామాయిల్ గెలల ధర పెంపు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది.
టన్ను పామాయిల్ గెలల ధరను రూ.20,506 వద్ద స్థిరీకరించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. పెరిగిన ధరలు జనవరి 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా.. టన్ను పామాయిల్ గెలల ధర గత నెలలో రూ.20,413 ఉండగా, దానికి రూ.93 పెంచి స్థిరీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తనవంతు మేలు చేస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Published date : 02 Jan 2025 09:51AM