Indian Sea Coas: 48% పెరిగిన భారతదేశ సముద్రతీరం పొడవు..
1970లో జారీ చేసిన డేటా ప్రకారం, దేశంలో 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలలో సముద్రతీరం పొడవు 7,516 కిలోమీటర్లుగా లెక్కించబడింది. అయితే.. నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ నిర్దేశించిన కొత్త విధివిధానాలు ప్రకారం నిర్వహించిన రీ-వెరిఫికేషన్‌లో, సముద్రతీరం పొడవు 11,098.81 కిలోమీటర్లగా తేలింది. గతంలో.. సముద్రతీరం పొడవును నేరుగా కొలిచేవారు. కానీ తాజా రీ-వెరిఫికేషన్‌లో మలుపులు, వంపులు కూడా లెక్కింపులో చేర్చడం వల్ల ఈ కొత్త మొత్తం నమోదైంది.
ఏపీలో పెరిగిన సముద్రతీరం పొడవు
- ఏపీ సముద్రతీరం పొడవు 973.70 కిలోమీటర్ల నుంచి 1,053.07 కిలోమీటర్లకు (8.15%) పెరిగింది.
- ఈ లెక్కలు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోనుంది. కాగా తమిళనాడు తీరం 906.90 కిలోమీటర్ల నుంచి 1,068.69 కిలోమీటర్లకు పెరిగింది.
Vande Bharat Trains: ఈ ఏడాది పట్టాలెక్కిన ‘వందేభారత్’ రైళ్లు ఇవే..
ఇతర రాష్ట్రాలు..
తమిళనాడు రాష్ట్రం: 906.90 కిలోమీటర్ల నుంచి 1,068.69 కిలోమీటర్లకి పెరిగింది.
గుజరాత్ తీరం: 92.69% పెరిగింది.
అండమాన్-నికోబార్ దీవులు: 57.16% పెరిగింది.
భారతదేశ తీరప్రాంతం మొత్తం పొడవు: కొత్త లెక్కల ప్రకారం.. మొత్తం 11,098.81 కిలోమీటర్లు.
భద్రతా చర్యలు
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో 15 కొత్త పోలీసు స్టేషన్లు ప్రారంభం అయ్యాయి.
జెట్టీలు: 7 కేటాయింపులు జరిగినా, ఒక్కటి కూడా నిర్మించబడలేదు.