Jeetendra Mishra: ఎయిర్ కమాండ్ విభాగం కమాండర్‌గా జితేంద్ర మిశ్ర
జీతేంద్ర 2024 డిసెంబర్ 31వ తేదీ పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా స్థానాన్ని చేపట్టారు. ఇప్పటివరకు జీతేంద్ర డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేశారు. ఎయిర్ మార్షల్ సిన్హా భారత వాయుసేనలో 39 సంవత్సరాలు సేవను అందించారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని భాగాలతో పాటు సున్నిత ప్రాంతమైన లద్ధాఖ్ సెక్టార్ భద్రత బాధ్యతను వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ నిర్వర్తిస్తుంది.
ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రా.. 1986 డిసెంబర్ 6వ తేదీ భారత వాయుసేన(ఎయిర్‌ఫోర్స్)లో ఫైటర్ పైలట్‌గా చేరారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణె, ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్, బెంగళూరు, ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, అమెరికా, రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్, యూకే వంటి ప్రముఖ విద్యా సంస్థల నుండి విద్యాభ్యాసం చేశారు. ఒక ఫైటర్ కాంబట్ లీడర్, ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్‌గా, ఆయన 3000 గంటలపైగా ఫ్లయింగ్ అనుభవాన్ని కలిగిఉన్నారు. 38 సంవత్సరాలకు పైగా సేవా కాలంలో, ఎయిర్ మార్షల్ మిశ్రా వివిధ కీలకమైన కమాండ్, సిబ్బంది పదవులు చేపట్టారు.