Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Sakshi Education
ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు అందజేశారు.

జనవరి 17వ తేదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డులు బహూకరించారు.
32 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు దక్కగా.. వారిలో 17 మంది పారాథ్లెట్‌లు ఉండటం విశేషం. ‘అర్జున అవార్డు’ దక్కిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి యర్రాజీ (ఆంధ్రప్రదేశ్), జివాంజి దీప్తి (తెలంగాణ) కూడా ఉన్నారు.
అవార్డులు అందుకున్న వారు వీరే..
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు:
- మహిళా షూటర్ మనూ భాకర్ (హరియాణా) – పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఘనత.
- ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (తమిళనాడు) – చెస్ లో అద్భుత ప్రదర్శన.
- భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (పంజాబ్) – హాకీ రంగంలో ప్రాముఖ్యత.
- పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్ (ఉత్తరప్రదేశ్) – పారాలింపిక్స్‌లో గొప్ప ప్రదర్శన
ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు:
- గుకేశ్ (చెస్)
- హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
- ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
- మనూ భాకర్ (షూటింగ్)
అర్ధున అవార్డులు:
- జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్)
- నీతు, స్వీటీ (బాక్సింగ్)
- వంతిక (చెస్)
- సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్ (హాకీ)
- రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ)
- ప్రీతి పాల్, జివాంజి దీప్తి, అజీత్ సింగ్ (పారా అథ్లెటిక్స్)
- కపిల్ పర్మార్ (పారా జూడో)
- మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
- స్వప్నిల్ కుసాలే, సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్)
- అభయ్ సింగ్ (స్క్వాష్)
- సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)
- అమన్ (రెజ్లింగ్)
అర్జున అవార్డు (లైఫ్‌టైమ్):
- సుచా సింగ్ (అథ్లెటిక్స్)
- మురళీకాంత్ పేట్కర్ (పారా స్విమ్మింగ్)
ద్రోణాచార్య అవార్డు:
- సుభాష్ రాణా (పారా షూటింగ్)
- దీపాలి దేశ్‌పాండే (షూటింగ్)
- సందీప్ (హాకీ)
- మురళీధరన్ (బ్యాడ్మింటన్)
- అర్మాండో కొలాకో (ఫుట్‌బాల్)
IND W vs IRE W: వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత జట్టు.. ఐర్లాండ్‌ను 304 రన్స్ తేడాతో..
Published date : 18 Jan 2025 03:31PM