New DG Of CRPF: సీఆర్‌పీఎఫ్ నూతన డీజీగా వితుల్ కుమార్
ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ డీజీగా పనిచేస్తున్న అనీష్ దయాల్ సింగ్ డిసెంబర్ 31న రిటైర్ అయ్యాక, వితుల్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వితుల్ కుమార్ ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
వితుల్ కుమార్ 1968 ఆగస్టు 3న పంజాబ్ రాష్ట్రం భటిండాలో జన్మించారు. ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్ చేసిన వితుల్, 2009 ఫిబ్రవరి 9న సీఆర్‌పీఎఫ్ డీఐజీగా పదోన్నతి పొందారు. 2012 డిసెంబర్ 31న ఐజీ, 2018 జనవరి 1న ఏడీజీగా పదోన్నతులు పొందారు. 2024 సెప్టెంబర్‌లో సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
ఆయన చేసిన సేవలు, సాహసం, కఠినతను పరిగణనలోకి తీసుకుంటూ 2021లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2009లో పోలీస్ మెడల్ లభించింది. అలాగే.. సీఆర్‌పీఎఫ్‌లో అత్యున్నత స్థాయిలో చేసిన సేవలకు గుర్తింపుగా డైరెక్టర్ జనరల్ కమెండేషన్ డిస్క్‌ను సిల్వర్, గోల్డ్ విభాగాల్లో అందుకున్నారు.
Chief Secretary of AP: ఏపీ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్