Chief Secretary of AP: ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా విజయానంద్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా కే విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని సీఎస్‌గా నియమిస్తూ డిసెంబర్ 29వ తేదీ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ పదవీకాలం డిసెంబర్ 31కి ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన సీఎస్‌గా నవంబర్ 30 వరకు కొనసాగనున్నారు.
విజయానంద్.. స్వస్థలం వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె. ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తన మొదటి పోస్టింగ్‌ను చేపట్టారు. అనంతరం ఆయన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీ(Managing Director)గా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(Chief Electoral Officer)గా కూడా ఆయన పనిచేశారు.
Published date : 31 Dec 2024 09:37AM