Pakistan: ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాక్
రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్‌కు ఈ అవకాశం దక్కింది. రెండేళ్లపాటు పాకిస్తాన్ మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగనుందని ఐరాస భద్రతామండలి జనవరి 1వ తేదీ ప్రకటించింది.
ఇందులోని కీలక అంశాలు..
పాకిస్తాన్‌కి సభ్యత్వం: ఐరాస భద్రతామండలిలో పాకిస్తాన్‌కి స్థానం దక్కడం ఇది ఎనిమిదోసారి. ఈ సందర్భంగా పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ మాట్లాడుతూ.. "ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించనుంది" అని పేర్కొన్నారు.
ఓటింగ్ ఫలితం: 193 దేశాలకు సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో జూన్ నెలలో ఓటింగ్ జరిగింది. ఇందులో 182 దేశాలు పాకిస్తాన్‌కు అనుకూలంగా ఓటేశాయి. 124 ఓట్లు అవసరమై 182 ఓట్లు రావడం విశేషం.
20th Anniversary of Quad: క్వాడ్ 20వ వార్షికోత్సవం.. ఇండో–పసిఫిక్ స్వేచ్ఛా, సుస్థిరతలే లక్ష్యం
భద్రతా మండలిలో పాకిస్తాన్‌కి సభ్యత్వం: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి. వీటిలో శాశ్వత సభ్యదేశాలు (అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్) మాత్రమే వీటో (veto) అధికారం కలిగివుంటాయి. మిగతా 10 దేశాలు రొటేషన్ పద్ధతిలో మారుతుంటాయి.
ఈ దేశాలు కూడా.. 2025-26 కాలంలో పాకిస్తాన్‌తో పాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొత్త సభ్యదేశాలుగా చేరనున్నాయి.