HMPV Virus in China: చైనాలో కొత్త వైరస్ కలకలం
ప్రపంచదేశాలు ఇంకా కరోనా సంక్షోభం నుంచి తేరుకున్నప్పుడే, ఈ కొత్త వైరస్ గురించి వచ్చిన సమాచారం పునరావృతమైన భయాలు తెచ్చిపెట్టింది. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రపంచ ఆరోగ్య పరిస్థుతులపై మరోసారి ఆలోచనలు మొదలయ్యాయి.
ప్రస్తుతం, ఈ వైరస్ చైనాలో కొంత వ్యాప్తి చెందిందని, ఇతర వైరసులతో (ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైసోప్లాస్మా నిమోనియో, కోవిడ్-19) కలసి విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా వైరస్‌పై భయాందోళనలు సృష్టిస్తున్నప్పటికీ, ఈ వార్తలను ఇంతవరకు చైనా ప్రభుత్వం లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించలేదు.
కొంతమంది వైద్యులు ఈ వైరస్ పాత వైరస్‌గా ఉండవచ్చని సూచిస్తున్నారు, అయితే వైరస్ వ్యాప్తి, ఆస్పత్రులు, శ్మశానాల వద్ద క్యూ లైన్ల వంటి దృశ్యాలు వైరస్ యొక్క తీవ్రత గురించి చర్చలకు దారితీస్తున్నాయి. వైరస్ యొక్క సాంప్రదాయ వ్యాప్తి, దాని సంక్రమణ శక్తి ఇంకా ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల, దేశాలు ఈ స్థితిపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.
Mpox Virus: భారత్‌లో నమోదైన ఎంపాక్స్ క్లేడ్ 1బీ తొలి కేసు!