Skip to main content

Indian Origins: భారత సంతతి ప్రముఖులకు బ్రిటన్‌ గౌరవ పురస్కారాలు

నూతన సంవత్సర సందర్భంగా బ్రిటన్‌ రాజు చార్లెస్-3 అందించే గౌరవ పురస్కారాల జాబితాలో భారత సంతతి 30 మందికి పైగా ఉన్నారు.
Over 30 Indian origin unsung heroes on King Charles New Year honours list

ఈ వ్యక్తులు వివిధ రంగాల్లో తమ అద్భుత సేవలను నిరూపించారు. వారు ప్రజాసేవలో సామాన్య వ్యక్తులుగా, కానీ అసాధారణ రీతిలో సేవలందిస్తున్నారు. ఈ జాబితాలో క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, స్వచ్ఛంద సేవల వంటి రంగాలలో సేవలందించిన 1,200 మందిని గుర్తించారు. ‘వీరంతా సాధారణ వ్యక్తులే. అయినా అసాధారణ రీతిలో ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు’ అని బ్రిటన్‌ ప్రధాని కియర్‌ స్టార్మర్‌ ప్రశంసించారు.

జాబితాలో పలు రంగాల వారు.. 
శ్రీలంక, భారత మూలాలున్న బ్రిటన్‌ ఎంపీ రణిల్‌ మాల్కమ్‌ జయవర్ధనేకు రాజకీయ, ప్రజాసేవ రంగాల్లో నైట్‌హుడ్‌ దక్కనుంది. విద్యారంగంలో సేవలకు సత్వంత్‌ కౌర్‌ డియోల్‌ ‘కమాండర్స్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌’ గౌరవం దక్కించుకున్నారు. న్యాయరంగంలో సేవలకు చార్లెస్‌ ప్రీతమ్‌ సింగ్‌ ధనోవా, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి ప్రొఫెసర్‌ స్నేహ ఖేమ్కా కూడా గౌరవ పురస్కారాలు అందుకోనున్నారు. 

Miss India USA: మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024గా చెన్నై యువతి

అలాగే జాబితాలో.. లీనా నాయర్, మయాంక్‌ ప్రకాశ్, పూర్ణిమ మూర్తి తణుకు, కార్డియాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ ఆర్య, ప్రొఫెసర్‌ నందినీ దాస్, తర్సేమ్‌ సింగ్‌ ధలీవాల్, జాస్మిన్‌ దోతీవాలా, మోనికా కోహ్లి, శౌర్య మజుందార్, సీమా మిశ్రా, ఉష్మా మన్‌హర్‌ పటేల్, గ్యాన్‌ సంగ్‌ పవర్, శ్రావ్యా రావ్, మన్‌దీప్‌ కౌర్‌ సంఘేరా, సౌరజ్‌ సింగ్‌ సిద్ధూ, స్మృతీ శ్రీరామ్, టెక్‌ నిపుణుడు దలీమ్‌ కుమార్‌ బసు, నర్సింగ్‌ చీఫ్‌ మారిమౌత్‌ కౌమరసామి, రుమటాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ భాస్కర్‌ దాస్‌గుప్తా, పీడియాట్రిక్‌ హెమటాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ అజయ్‌ జైకిషోర్‌ వోరా, కమ్యూనిటీ వర్కర్లు సంజీబ్‌ భట్టాచార్య, జగ్‌రూప్‌ బిన్నీ, పోస్టల్‌ వర్కర్‌ హేమంద్ర హిందోచా, స్వచ్ఛంద కార్యకర్త జస్వీందర్‌ కుమార్, సంగీతకారుడు బల్బీర్‌సింగ్‌ ఖాన్‌పూర్‌ భుజాంగీ తదితరులకూ జాబితాలో చోటు దక్కింది.

Richest Families: ప్రపంచ సంపన్న కుటుంబాల జాబితా విడుదల.. టాప్-10లో అంబానీ ఫ్యామిలీ

Published date : 01 Jan 2025 12:41PM

Photo Stories