Sports Awards: తెలుగు తేజాలు దీప్తి, జ్యోతిలకు ‘అర్జున’ అవార్డు
అర్జున అవార్డుకు ఎంపికైన 32 మంది అథ్లెట్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన జ్యోతి యర్రాజి, తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి ఉన్నారు.
జ్యోతి యర్రాజి.. పారిస్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచింది. 2023 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం. 200 మీటర్లలో రజతం సాధించింది. 2023, 2024లలో జరిగిన ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ, రజతాలు గెలిచింది.
జీవాంజి దీప్తి.. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల టీ20 కేటగిరీలో కాంస్యం.. 2024 ప్రపంచ పారాథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించింది. 2023 హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో దీప్తి బంగారు పతకం గెలిచింది. దీప్తికి భారత స్పోర్ట్స్ ఆధారిటీ కోచ్ నాగపురి రమేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ అవార్డులు జనవరి 17వ తేదిన రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు.