Guinness Record: గిన్నిస్ రికార్డు సాధించిన ‘హ్యుందాయ్ అయానిక్ 5’
Sakshi Education
‘హ్యుందాయ్ అయానిక్ 5’ విద్యుత్ ఎస్‌యూవీ కారు అత్యంత ఎత్తైన ప్రదేశంలో ప్రయాణించిన కారుగా ఘనత సాధించింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన విద్యుత్ ఎస్‌యూవీ ‘అయానిక్ 5’ గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో చోటు చేసుకున్నట్లు ప్రకటించింది. అత్యంత ఎత్తైన ప్రదేశంలో ప్రయాణించిన కారుగా ఈ రికార్డు సృష్టించింది. లేహ్ లద్దాఖ్ లోని ఉమ్లింగ్ లా (5,802 మీటర్లు) ఎత్తు నుంచి కేరళలోని కుట్టనాడ్ (5,799 మీటర్లు) వరకు అయానిక్ 5 ప్రయాణించి ఈ ప్రతిష్టాత్మక రికార్డు సాధించింది.
ఈ అసాధారణ ప్రయాణాన్ని ఇవో ఇండియా కు చెందిన నిపుణుల బృందం నడిపించారు. ఈ ప్రయాణం కేవలం 14 రోజుల్లో పూర్తయ్యింది. ఇందులో వివిధ రకాల రహదారులు, వాతావరణ పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ, అయానిక్ 5 తన సత్తా ప్రదర్శించింది. మొత్తం 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ కారు తమ శక్తిని ప్రదర్శించిందని హ్యుందాయ్ వెల్లడించింది.
Guinness Record: జీఆర్‌టీ జువెలర్స్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డు
Published date : 30 Dec 2024 03:26PM