Skip to main content

Order of Mubarak Al Kabeer: మోదీకి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌–కబీర్‌’ పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌–కబీర్‌’ లభించింది.
Modi receives Order of Mubarak Al Kabeer' award

కువైట్‌ రాజు షేక్‌ మెషల్‌ అల్‌–అహ్మద్‌ అల్‌–జబేర్‌ అల్‌–సబా డిసెంబ‌ర్ 22వ తేదీ ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఇది మోదీకి దక్కిన 20వ అంతర్జాతీయ గౌరవం. 

  • స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ రాజకుటుంబ సభ్యులకు కువైట్‌ ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌ అవార్డు. 
  • గతంలో బిల్‌ క్లింటన్, ప్రిన్స్‌ చార్లెస్, జార్జ్‌ బుష్‌ వంటి విదేశీ నేతలు ఈ పురస్కారం అందుకున్నారు.
  • ప్ర‌ధాని మోదీ డిసెంబ‌ర్ 21, 22వ తేదీలో గల్ఫ్‌ దేశమైన కువైట్‌లో పర్యటించారు.
PM Modi: ప్రధాని మోదీ కువైట్‌ పర్యటన.. 43 ఏళ్లలో ఇదే మొదటిసారి..
Published date : 23 Dec 2024 03:37PM

Photo Stories