Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వంలో మరో భారత అమెరికన్
గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్‌బుక్, స్నాప్‌లో పనిచేసిన కృష్ణన్.. ఇక వైట్ హౌస్ ఏఐ & క్రిప్టో జార్‌గా ఉండే 'డేవిడ్ సాక్స్'తో కలిసి పని చేయనున్నారు.
ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?
తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు.
విండోస్ అజూర్ వ్యవస్థాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్‌లో కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్.. తరువాత మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్‌బుక్, స్నాప్ వంటి వాటిలో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. కాగా ఇప్పుడు ఈయన వైట్ హౌస్‌లో పనిచేయనున్నారు.
Kashyap Patel: ‘ఎఫ్‌బీఐ’ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్.. అమెరికాలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి
'దేశానికి సేవ చేయడం, ఏఐలో అమెరికా నాయకత్వానికి సన్నిహితంగా పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు' అంటూ.. శ్రీరామ్ కృష్ణన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
'శ్రీరామ్ కృష్ణన్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమించినందుకు సంతోషిస్తున్నాము' అని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు.
Francois Bayrou: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఫ్రాంకోయిస్ బైరూ