India, Qatar Strategic Partnership: ఐదేళ్లలో వాణిజ్యం రెట్టింపు.. భారత్, ఖతార్ ద్వైపాక్షిక చర్చలు

ప్రస్తుతం 14 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 28 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇరు దేశాల మధ్య సంబంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు భారత ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్–థానీ మధ్య ఫిబ్రవరి 18వ తేదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
ఈ ఒప్పందాలలో ఆర్థిక భాగస్వామ్యం, యువజన వ్యవహారాలు, క్రీడలు, పురాతన వస్తువుల నిర్వహణ, ద్వంద్వ పన్నుల విధానం నివారణ వంటి అంశాలు ఉన్నాయి. ఖతార్, భారతదేశంలో మౌలిక వసతులు, నౌకాశ్రయాలు, ఇంధనం, పునరుత్పాదక ఇంధన రంగం, స్మార్ట్ సిటీల సృష్టి వంటి రంగాలలో పెట్టుబడులను పెంచడానికి సిద్ధమైంది.
PM Modi: భారత్, అమెరికా మధ్య రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు
భారత్, ఖతార్ మధ్య రక్షణ, భద్రత అంశాలలో కూడా సమన్వయం పెంచేందుకు నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ భాగస్వామ్యం వల్ల, రెండు దేశాలు సీమాంతర ఉగ్రవాదం సహా అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఉమ్మడి ఎజెండాను రూపొందించాయి.
ముఖ్యంగా.. గత ఏడాది ఖతార్‌తో 78 బిలియన్ డాలర్ల సహజ వాయువు ఒప్పందం కుదుర్చుకున్నారు, 2048 వరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీ దిగుమతిని ఖతార్, భారత్‌కు మరింత తగ్గిన ధరలతో అందించనుంది.
ఫిబ్రవరి 17 నుంచి రెండు రోజుల పర్యటన కోసం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ భారత్‌కు వచ్చారు. తమీమ్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2015లో ఆయన భారత్‌కు వచ్చారు.
PM Modi: భారత్, అమెరికా మధ్య రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు