Elections in Canada: ఏప్రిల్ 28వ తేదీ కెనడాలో ఎన్నికలు
Sakshi Education
ఏప్రిల్ 28వ తేదీ ముందస్తు పోలింగ్ జరపనున్నట్లు మార్చి 23వ తేదీ కెనడా ప్రధానమంత్రి కార్నీ ప్రకటించారు.

ట్రంప్ అధ్యక్షుడయ్యాక అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న వేళ ఆయనీ ప్రకటన చేశారు.
జస్టిన్ ట్రూడో పదవి నుంచి వైదొలగడంతో రెండు వారాల క్రితమే కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ మార్చి 23వ తేదీ ఆయన గవర్నర్ జనరల్‌తో భేటీ అయి పార్లమెంట్‌ను రద్దు చేయాలని కోరారు. అక్టోబర్ 20న ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార లిబరల్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో కార్నీ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
US Immigration: సంచలన ప్రకటన.. అమెరికా నుంచి 5 లక్షల మంది బహిష్కరణ..!
Published date : 24 Mar 2025 02:07PM