Missile City: భూగర్భజలంలో మరో క్షిపణి నగరం

భూగర్భంలో సిద్ధం చేసుకున్న మూడో 'క్షిపణి నగరం' తాలూకు విశేషాలను మార్చి 26వ తేదీ బయట పెట్టింది. ఇందుకు సంబంధించి 85 సెకన్ల వీడియోను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్(IRGC) విడుదల చేసింది.
సారంగాల వంటి నిర్మాణాల నిండా భద్రపరిచి ఉంచిన ఖైబర్ షెకాన్, గదర్-హెచ్, సెజిల్ తదితర అత్యాధునిక క్షిపణులు అందులో కన్పిస్తున్నాయి. ఐఆర్సీజీ ఏరోస్పేస్ చీఫ్ ఆమిర్ అలీ హజీజాదే, పలువురు సైనిక ఉన్నతాధికారులు వాటిని చూస్తూ కన్పిస్తున్నారు.
Ukraine-Russia Deal: ఉక్రెయిన్‌తో భూమి ఖనిజాల ఒప్పందం
సదరు వీడియో ప్రభుత్వ టీవీ చానల్లో కూడా ప్రసారమైంది. ఇజ్రాయెల్ దూకుడును అడ్డుకునేందుకు ఆయుధ పాటవాన్ని పెంచుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఇరాన్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టింది. అయితే కీలక ఆయుధాల నిల్వ విషయంలో ఇరాన్ బలహీనతలు ఈ వీడియోతో మరోసారి తెరపైకి వచ్చాయని రక్షణ నిపుణులు అంటున్నారు. వైమానిక దాడులు జరిగితే వాటిని కాపాడుకోవడం దాదాపుగా అసాధ్యమని అభిప్రాయపడుతున్నారు.
క్షిపణి, ఇతర అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఇరాన్ భూగర్భంలో నిల్వ చేస్తున్న వైనం 2020లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. యురేనియం శుద్ధి, అణు, క్షిపణి కార్యక్రమాలన్నింటినీ కట్టి పెట్టేలా నూతన ఒప్పందానికి ఒప్పుకోవాలంటూ ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెస్తుండటం తెలిసిందే. అందుకు రెండు నెలల డెడ్లైన్ విధిం చారు. ఆలోగా ఒప్పందానికి అంగీకరించని పక్షంలో మరిన్ని కఠిన ఆంక్షలతో పాటు సైనిక చర్య వంటివి కూడా తప్పవని హెచ్చరిస్తూ నెల క్రితం ఇరాన్కు లేఖ కూడా రాశారు. కానీ దానికి ఇరాన్ ససేమిరా అంటోంది.
3D Printed Train: ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్.. ఎక్కడంటే..