India, Mauritius Elevate Ties: 'విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం'గా ద్వైపాక్షిక బంధం

ఇరు దేశాల ప్రధానమంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. వ్యాపారం, వాణిజ్యం, సముద్రయాన రక్షణ తదితర కీలక రంగాల్లో పరస్పర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి.
ఎనిమిది కీలక ఒప్పందాలు..
ఇందులో భాగంగా భారత్, మారిషస్ మధ్య ఎనిమిది కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటిలో, సీమాంతర లావాదేవీల కోసం ఇరు దేశాలు తమ నేషనల్ కరెన్సీలు ఉపయోగించుకోవచ్చు, మారిటైమ్ డేటాను పంచుకోవచ్చు, మనీ లాండరింగ్ను నియంత్రించడానికి ఉమ్మడిగా కృషి చేయవచ్చు, ఎంఎస్ఎంఈ రంగంలో సహకారం పెంపొందించుకోవచ్చు అనే అంశాలు ఉన్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాములాం మార్చి 12వ తేదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మోదీ "మహాసాగర్" పేరిట గ్లోబల్ సౌత్ అభివృద్ధికి సంబంధించిన కొత్త దార్శనికతను ప్రకటించారు.
PM Modi: మారిషస్.. భారత్‌కు, గ్లోబల్ సౌత్‌కు మధ్య ఒక వంతెన
మోదీ హిందూ మహాసముద్రంపై చైనా చేసిన ప్రక్షిప్త ప్రయత్నాల నేపథ్యంలో, "మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ ఆం డ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్స్" (మహాసాగర్) అనే విజన్‌ను ప్రకటించారు. ఇది స్వేచ్చాయుతమైన, భద్రతతో కూడిన హిందూ మహాసముద్రానికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడం గురించి ఉద్దేశించబడింది.
భారత్ నుంచి బహుమతి
ప్రధాని మోదీ 2015లో మారిషస్‌లో పర్యటించినప్పుడు సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) పాలసీని ప్రకటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇండియా ప్రాముఖ్యతను పెంచడానికి ఈ విధానం తీసుకొచ్చారు. 'సాగర్'ను మరింత ముందుకు తీసుకెళ్తూ 'మహా సాగర్'ను ఆవిష్కరించినట్లు మోదీ ఉద్ఘాటించారు. గ్లోబల్ సౌత్‌లో శాంతి, సౌభాగ్యం, సుస్థిరతను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
మారిషస్‌లో నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి సహకరిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి లాంటి భారత్ నుంచి మారిషస్‌కు ఇదొక బహుమతి అవుతుందన్నారు. ఇండియాలో చార్ధామ్ యాత్ర, రామాయణ్ యాత్రలో పాల్గొనే మారిషస్ ప్రజలకు తగిన వసతులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు.
India-EU Agreement: పట్టాలెక్కనున్న ఎఫ్‌టీయూ.. భారత్, ఈయూ నిర్ణయం
మారిషస్ జాతీయ దినోత్సవంలో మోదీ
ప్రధాని మోదీ 57వ మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సందర్భంగా మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారం "ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషియన్"ను పురస్కారంతో అప్పగించారు. ఈ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి భారత ప్రధాని మోదీ, ఈ పురస్కారాన్ని భారత్, మారిషస్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాల ప్రతీకగా అభివర్ణించారు.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)