India-France: భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక చర్చలు

ఇరువురు నేతలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి మాసే నగరానికి విమానంలో వెళ్తూ చర్చల్లో పాల్గొన్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సుదృఢమైన సంబంధాలే లక్ష్యంగా విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు సైతం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఏడాది ద్వైపాక్షిక సహకారం విషయంలో డిజిటల్ హెల్త్, యాంటీ–మైక్రోబియల్ రెసిస్టెన్స్, రెండు దేశాల మధ్య ఆరోగ్య నిపుణుల మార్పిడిని ప్రాధాన్య అంశాలుగా గుర్తించారు.
ఈ చర్చలు రెండు దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, మరియు ఇతర కీలక రంగాల్లో మరింత బలోపేతం కావడానికి తీసుకున్న ముఖ్యమైన చర్యలతో కూడుకున్నాయి. ఇరు దేశాలు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సహకారం పెంచుకునే ఉద్దేశ్యంతో, అంతర్జాతీయ వేదికలపై కూడా పరస్పర సంబంధాలను ప్రగతిపరిచేందుకు నిర్ణయించారు.
మోదీ, మాక్రాన్ గ్లోబల్ భద్రతా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడాన్ని మాక్రాన్ గట్టిగా మద్దతు ఇచ్చారు.
2026లో "ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్"గా జరుపుకోవడం, డిజిటల్ హెల్త్, యాంటీ–మైక్రోబియల్ రెసిస్టెన్స్ వంటి అనేక సాంఘిక, ఆరోగ్య రంగాలలో ద్వైపాక్షిక సహకారం పెంచడం మీద వారి దృష్టి ఉంది.
AI Summit: ఫ్రాన్స్‌లో ప్రారంభమైన ఏఐ శిఖరాగ్ర సదస్సు.. పారిస్‌లో జరుగుతున్న తొలి సదస్సు ఇదే..
ఉమ్మడిగా అణు రియాక్టర్ల అభివృద్ధి
ఇంధన భద్రత, కర్బన రహిత ఆర్థిక వ్యవస్థకు అణు విద్యుత్ ఉత్పత్తి చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ, ఇమ్మానుయేల్ మాక్రాన్ అభిప్రాయపడ్డారు. అత్యాధునిక న్యూక్లియర్ రియాక్టర్లను ఉమ్మడిగా అభివృద్ధి చేసుకోవడానికి వారు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్‌ఎంఆర్), అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ రియాక్టర్లు(ఏఎంఆర్)ల అభివృద్ధికి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
భారతీయ జవాన్లకు నివాళులు
మాసే సిటీకి చేరుకున్న మోదీ, మాక్రాన్‌లకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాసేలోని చరిత్రాత్మక మజర్‌గిస్ శ్మశాన వాటికను మోదీ, మాక్రాన్ సందర్శించారు. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచయుద్ధంలో ప్రాణత్యాగాలు చేసిన భారతీయ సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడి ఇండియన్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు.
సావర్కర్‌కు మోదీ నివాళులు
భారత స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌కు మాసే సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. సముద్ర తీరప్రాంత నగరమైన మాసే నుంచే సావర్కర్ సాహసోపేతంగా తప్పించుకొనేందుకు ప్రయత్నించారని వెల్లడించారు.
AI Summit: ఏఐతో ఉద్యోగాలు పోవు.. ప్రధాని మోదీ
ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం
ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ ఫిబ్రవరి 12వ తేదీ మాసే సిటీలో భారత నూతన కాన్సులేట్‌ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారతీయులు, ఫ్రాన్స్ పౌరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ దేశ జాతీయ జెండాలు చేతబూని సందడి చేశారు.
మా యువ శక్తిపై పందెం కాయొచ్చు
ప్రధాని మోదీ పారిస్‌లో గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ)తో భారత్‌కు లభించే అవకాశాలపై వారు చర్చించారు. ఇండియాలో డిజిటల్ పరివర్తన కోసం గూగుల్, ఇండియా ఎలా కలిసి పని చేయాలన్నదానిపై మాట్లాడుకున్నారు. మోదీతో సమావేశమైన ఫొటోలను సుందర్ పిచాయ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)