Astra Missile: ఆస్ట్రా విసైల్ పరీక్ష విజయవంతం
Sakshi Education
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ ఆస్ట్రాను భారత్ మార్చి 12వ తేదీ విజయవంతంగా పరీక్షించింది.

ఈ క్షిపణి పరీక్ష ఒడిశా రాష్ట్రంలోని ఛాండీపూర్ తీరంలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం చేపట్టబడింది. గగనతలంలో కదులుతున్న లక్ష్యాన్ని తేజస్ యుద్ధ విమానం నుంచి ఆస్ట్రా క్షిపణి నేరుగా ఛేదించింది.
ఈ మిస్సైల్ పరీక్షలో అన్ని వ్యవస్థలు నిర్దేశిత పరామితులను అందుకున్నాయని రక్షణ శాఖ తెలిపింది. ఈ ఆస్ట్రా క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసింది.
100 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఆస్ట్రా చేధించగలదు. కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇందులో అధునాతన నావిగేషన్ సిస్టమ్ ఉంది.
Published date : 13 Mar 2025 03:33PM