Oilfields Amendment Bill: చమురు క్షేత్రాల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ఈ బిల్లు చమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించి, చమురు ఉత్పత్తిని పెంచేందుకు రూపోందించిన కీలక చట్టపరమైన చర్య. మార్చి 12వ తేద లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదం తెలపగా, రాజ్యసభ గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన ఈ బిల్లును ఆమోదించింది.
ముఖ్యమైన అంశాలు..
చమురు ధరలు: ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. గత మూడేళ్లలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువగా ఉన్నాయి. ఈ సతతమైన ధరల తగ్గింపును కేంద్రం సుంకాలను తగ్గించడం ద్వారా సాధించింది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సమప్రాధాన్యం: ఈ బిల్లులో, చమురు క్షేత్రాల అన్వేషణ మరియు ఉత్పత్తి రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సమప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అలాగే.. ఇంధన వనరుల లీజు, రాయల్టీ పొందడం వంటి అంశాలలో రాష్ట్రాల హక్కులు కూడా మరింత బలపరచబడతాయి.
DA Increase: శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
సవరణలు: 1948 నాటి చమురు క్షేత్రాల చట్టంలో చిన్న మార్పులు చేయబడ్డాయి. ఇందులో.. నేర పరిధి నుంచి కొన్ని నిబంధనలు తొలగించడం, జరిమానాలు విధించడం, తీర్పులపై అప్పీల్‌కు అవకాశం కల్పించడం వంటి అంశాలు చేర్చబడ్డాయి.
లక్ష్యం: ఈ బిల్లుకు ప్రధానంగా చమురు ఉత్పత్తిని పెంచడం అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ప్రత్యేకంగా, చమురు క్షేత్రాల అన్వేషణ, ప్రొడక్షన్ ద్వారా దేశం లోపలి ఇంధన అవసరాలను తీర్చడం, ఆర్థిక స్వావలంబన సాధించడం ముఖ్యమైన లక్ష్యాలు.
Mahila Samridhi Yojana: మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2500 ఇవ్వనున్న ప్రభుత్వం