Skip to main content

US and Russia: అగ్ర రాజ్యాల స్నేహగీతం.. అమెరికా, రష్యా ద్వైపాక్షిక బంధాలు

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి.
US and Russia Begin Ukraine Peace Talks in Saudi Arabia

అందులో భాగంగా అన్నిరకాలుగానూ మూడేళ్లుగా దాదాపుగా వెలి వేసిన రష్యాతో ఏకంగా ఉన్నతస్థాయి చర్చలకు అమెరికా తెర తీసింది. దాని మిత్ర దేశం సౌదీ అరేబియా వేదికగా ఫిబ్ర‌వ‌రి 18వ తేదీ ఈ చర్చలు జ‌రిగాయి. 

ఈ చర్చల్లో.. ఉక్రెయిన్ యుద్ధం, రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై ముఖ్యంగా దృష్టి పెట్టారు. అయితే, ఈ చర్చల్లో ఉక్రెయిన్‌ను ప్రాతినిధ్యం కల్పించకపోవడం విశేషం. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా తీసుకునే నిర్ణయాలను అంగీకరించేది కాదని అన్నారు.

దీనికి తోడు యూరప్ దేశాలు కూడా ఉక్రెయిన్‌ను చర్చలలో పక్కన పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. రష్యాతో యుద్ధంలో అమెరికా సహాయం తగ్గించిన నేపథ్యంలో, యూరప్ దేశాలు ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ కీలక సమావేశం జరిపి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు ప్రారంభించాయి.

PM Modi: భార‌త్‌, అమెరికా మ‌ధ్య రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు

అమెరికా-రష్యా సంబంధాలను మెరుగుపర్చే దిశగా, చర్చల్లో రూబియో, లవ్రోవ్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో రెండు దేశాల రాయబార కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను పెంచడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో భేటీ కావడం నిర్ణయించారు.

ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలను, సంబంధాలను పునరుద్ధరించే అవకాశాలను తీసుకొస్తుంది.

పుతిన్, రష్యా యొక్క ప్రాధాన్యతలు, ఉక్రెయిన్ యొక్క యూరోపియన్ యూనియన్ సభ్యత్వానికి సంబంధించి అభ్యంతరాలు లేకపోయినా, నాటో సభ్యత్వంపై మాత్రం సీరియస్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, ఇతర అధికారి‌లు ఇందులో పాల్గొన్నారు. 

Artificial Intelligence: ఈ దేశాల మధ్య ఏఐపై ఆసక్తికరమైన చర్చలు, విభేదాలు!

Published date : 19 Feb 2025 02:59PM

Photo Stories