FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన న్యూజిలాండ్

పది దేశాలు పోటీపడ్డ ఓసియానియా జోన్ నుంచి 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. మార్చి 24వ తేదీ జరిగిన ఓసియానియా జోన్ ఫైనల్లో న్యూజిలాండ్ 3–0 గోల్స్ తేడాతో న్యూ కాలడోనియా జట్టుపై గెలిచింది.
న్యూజిలాండ్ తరఫున మైకేల్ జోసెఫ్ బాక్సల్ (61వ నిమిషంలో), బార్సరూసెస్ (66వ నిమిషంలో), హెన్రీ జస్ట్ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఫైనల్లో ఓడిపోయిన న్యూ కాలడోనియా జట్టుకు ప్రపంచకప్ బెర్త్ దక్కించుకునే మరో అవకాశం మిగిలి ఉంది.
ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణా అమెరికా జోన్‌లకు చెందిన ఆరు జట్లు పోటీపడే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ టోర్నీలో విజేతగా నిలిస్తే న్యూ కాలడోనియా జట్టు కూడా ప్రపంచకప్‌కు అర్హత పొందుతుంది.
WPL-2025: డబ్ల్యూపీఎల్ విజేతగా ముంబై ఇండియన్స్
2026లో ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, కెనడా, మెక్సికో ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత పొందగా.. జపాన్, న్యూజిలాండ్ ఈ మూడు జట్లతో చేరాయి.
వందేళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ పోటీపడనుండటం ఇది మూడోసారి. తొలిసారి 1982లో వరల్డ్‌కప్‌లో ఆడిన న్యూజిలాండ్ రెండోసారి 2010 ప్రపంచకప్‌లో పోటీపడింది. ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్ టోర్నీలకు న్యూజిలాండ్ అర్హత సాధించడంలో విఫలమైంది.
Asian Championship: ఐదోసారి ఆసియా కబడ్డీ టైటిల్ నెగ్గిన భారత మహిళల జట్టు