Skip to main content

WPL-2025: డబ్ల్యూపీఎల్‌ విజేతగా ముంబై ఇండియన్స్

డబ్ల్యూపీఎల్‌-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Mumbai Indians beat Delhi Capitals in WPL

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్య చేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వెనుక పడింది. 

నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్‌ జట్టు ఈ సీజన్‌కి విజేతగా నిలిచింది. ఈ విజయంతో రెండోసారి ముంబై జట్టు టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, నాట్‌సీవర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచారు.

Asian Championship: ఐదోసారి ఆసియా కబడ్డీ టైటిల్‌ నెగ్గిన భారత మహిళల జట్టు

Published date : 17 Mar 2025 04:45PM

Photo Stories