Skip to main content

PM Modi: భార‌త్‌, అమెరికా మ‌ధ్య రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్‌ వాల్జ్‌తో ప్రధాని మోదీ ఫిబ్ర‌వ‌రి 13వ తేదీ భేటీ అయ్యారు.
Defence Ties In Focus As PM Modi Meets US Security Advisor Michael Waltz

రక్షణ, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై వారు చర్చించారు. మైఖేల్‌ వాల్ట్‌జ్‌తో ఫలవంతమైన చర్చ జరిగిందని ‘ఎక్స్‌’లో మోదీ పేర్కొన్నారు. భారత్‌కు ఆయన గొప్ప స్నేహితుడు అని కొనియాడారు. భారత్‌– అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రత.. అత్యంత ముఖ్యమైన కోణాలని, వీటిపై తమ మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిందని మోదీ తెలిపారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, సెమీకండక్టర్స్, అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సైతం పాల్గొన్నారు. ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకున్న మోదీ అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డి.సి.కి చేరుకున్నారు.  

భారత్‌–అమెరికా బంధానికి  మద్దతుదారు తులసి 
డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో ‘డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌’గా నియమితులైన హిందూ–అమెరికన్‌ తులసి గబార్డ్‌తో మోదీ సమావేశమయ్యారు. బ్లెయిర్‌ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. భారత్‌–అమెరికా సంబంధాలపై వారు చర్చించారు.

ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైబర్‌ సెక్యూరిటీలో ఇంటెలిజెన్స్‌ సహకారం మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని తులసి గబార్డ్‌ కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. భారత్‌–అమెరికా బంధానికి ఆమె గట్టి మద్దతుదారు అని పేర్కొన్నారు.

Artificial Intelligence: ఈ దేశాల మధ్య ఏఐపై ఆసక్తికరమైన చర్చలు, విభేదాలు!

ప్రధాని మోదీ రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. ఫిబ్ర‌వ‌రి 13వ తేదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఆయన సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ట్రంప్‌ ‘అమెరికా ఫస్టు’ అనే విధానంతో ముందుకెళ్తూ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.  

త్వరలో అమెరికా నుంచి మరో 487 మంది వలసదారులు
మరో 487 మంది అక్రమ వలస దారులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించనుందని కేంద్రం వెల్లడించింది. ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన వలసదారుల ఏరివేతలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా వైమానిక దళ ప్రత్యేక విమానం అమృతసర్‌కు వ‌చ్చారు. భారతీ యులుగా భావిస్తున్న మరో 487 మందిని గుర్తించిన అమెరికా అధికారులు వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. 

మరికొంత మందికి సంబంధించిన సమాచారం అమెరికా అధికారులు వెల్లడించనందున అక్రమ వలసదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధికారులు పంపించిన 487 మంది వలసదారుల పేర్లు, ఇతర వివరాల జాబితాను పరిశీలిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో పంపించిన 104 మందిలో పంజాబ్, హరియాణాలకు చెందిన వారు అత్యధికులుండటం తెలిసిందే.

AI Summit: ఏఐతో ఉద్యోగాలు పోవు.. ప్రధాని మోదీ

Published date : 14 Feb 2025 03:11PM

Photo Stories