Skip to main content

AI Summit: ఏఐతో ఉద్యోగాలు పోవు.. ప్రధాని మోదీ

అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు మాయమవుతాయన్న భయాలను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికగా పటాపంచలు చేశారు.
PM Narendra Modi Comments at Paris AI Summit 2025

ప్రధాని మోదీ ఏఐ గురించి మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీ ఉద్యోగాలు మాయమవుతాయన్న భయాలను తిరస్కరించారు. ఫిబ్ర‌వ‌రి 11వ తేదీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025కు సహాధ్యక్షత వహించిన ఆయన, టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని కాదు, కేవలం వారి స్వభావం మారి కొత్త ఉద్యోగాలు ఉత్పన్నం అవుతాయని స్పష్టం చేశారు.

మోదీ ముఖ్యమైన వ్యాఖ్యలు ఇవే..
ఉద్యోగాలు, నైపుణ్యాలు: "టెక్నాలజీ వల్ల పాత ఉద్యోగాలు పోతాయి, కానీ కొత్త ఉద్యోగాలు వస్తాయి" అని ఆయన అన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంచుకోవాలని, కొత్త నైపుణ్యాలను పొందడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

సాంకేతిక వృద్ధి: ఏఐ మన పొలిటికల్, ఆర్థిక, భద్రతా, సమాజ రంగాలను మరింత మెరుగుపరుస్తుందని, ప్రత్యేకంగా విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలలో ఈ టెక్నాలజీ సామాజిక ప్రయోజనాలు చేకూర్చగలదని చెప్పారు.

భారతదేశంలో ఏఐ వినియోగం: భారతదేశం అనేక డిజిటల్ మౌలిక వసతులను ఏర్పాటు చేసి, ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేస్తోంది. 140 కోట్ల మందికి సేవలు అందించేందుకు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్(LLM)ని కూడా అభివృద్ధి చేస్తున్నారు.

AI Summit: ఫ్రాన్స్‌లో ప్రారంభమైన ఏఐ శిఖరాగ్ర సదస్సు.. పారిస్‌లో జరుగుతున్న తొలి సదస్సు ఇదే..

ఓపెన్ సోర్స్ ఏఐ: ప్రజావిశ్వాసం, పారదర్శకత పెంచడం కోసం ఓపెన్ సోర్స్ ఏఐ వినియోగానికి సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన అవసరమని మోదీ తెలిపారు.

జాతీయ ఏఐ మిషన్: నేషనల్ ఏఐ మిషన్‌లో భారతదేశం తన అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. జీ20 దేశాల సహకారంతో, ఏఐ వాడకం బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు.

తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్: ప్రధాని మోదీ తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్‌ను భారతదేశంలో నిర్వహించాలని ప్రతిపాదించారు.

విశ్వవ్యాప్త ఏఐ భాగస్వామ్యం: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి, ఏఐ ఫౌండేషన్ మరియు సుస్థిర ఏఐ మండలి ఏర్పాటు చేయాలని సదస్సు నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు. దక్షిణాది దేశాల అవసరాలు, ఆందోళనలు కూడా గుర్తించి వాటిని ఈ చర్చల్లో చేర్చాలని సూచించారు.

PM Modi's Foreign Tours: ప్రధాని మోదీ 11 ఏళ్లలో చేసిన 86 విదేశీ పర్యటనలు ఇవే..

ఏఐ సామర్థ్యానికి అటూఇటూ.. ప్రధాని మోదీ 
కృత్రిమ మేధ సామర్థ్యం ఎంతో పెరిగింది. ఒక ఏఐ యాప్‌లోకి వైద్య నివేదికను అప్‌లోడ్‌ చేస్తే అది వైద్యపరిభాషలోని సాంకేతిక అంశాలను పక్కనపెట్టి మనకు అర్థమయ్యే సరళమైన భాషలో నివేదిక సారాంశాన్ని సులువుగా వివరించగలదు. అదే సమయంలో ఏఐ పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు అదే యాప్‌ను ఎడమ చేత్తో రాస్తున్న వ్యక్తి చిత్రాన్ని గీయమంటే అది దాదాపుగా కుడి చేత్తో రాస్తున్న వ్యక్తి బొమ్మ గీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఏఐ పాలన గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. 

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 12 Feb 2025 12:20PM

Photo Stories