Skip to main content

Inter Exams Valuation : కొన‌సాగుతున్న ఇంట‌ర్ ప‌రీక్ష‌ల మూల్యాంక‌నం.. జాగ్ర‌త్త‌లు పాటించాలి..

సోమవారం నుంచి మొదలైన రసాయన శాస్త్రంలో 21,001 జవాబు పత్రాలు, చరిత్రలో 993 జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోందని వివరించారు.
AP inter board exams valuation updates

అమలాపురం టౌన్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలోని స్పాట్‌ వాల్యూయేషన్‌ సెంటరులో చరిత్ర, రసాయన శాస్తం జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం మొదలైంది. ఇప్పటికే ఈ సెంటరులో సంస్కృతం, తెలుగు, ఇంగ్లిషు, గణితం, పౌరశాస్త్రం, భౌతిక శాస్త్రం, అర్థ శాస్త్రాలకు సంబంధించిన జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియ కొనసాగుతోందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. మరో మూడు పాఠ్యాంశాల జవాబు పత్రాలకు మూల్యాంకనం మొదలు కావాల్సి ఉందన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల మూల్యాంకనం జరుగుతోందని చెప్పారు.

KVS Draw of Lots Schedule : కేవీఎస్ ప్ర‌వేశాల‌కు లాట‌రీ ఫ‌లితాలు.. డ్రా ఆఫ్ లాట్స్ షెడ్యూల్ ఇలా..

సోమవారం నుంచి మొదలైన రసాయన శాస్త్రంలో 21,001 జవాబు పత్రాలు, చరిత్రలో 993 జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోందని వివరించారు. స్థానిక స్పాట్‌ వాల్యూయేషన్‌ సెంటరులో మూల్యాంకనం జాగ్రత్తలపై సంబంధిత అధికారులు, అధ్యాపకులతో సోమవారం మరోసారి డీఐఈవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్లు పి.కర్ణారావు, వి.నాగలక్ష్మి, అడబాల శ్రీనివాస్‌, వై.లక్ష్మణరావు, చీఫ్‌ కోడింగ్‌ ఆఫీసర్‌ ఇ.సువర్ణకుమార్‌, స్పాట్‌ వాల్యూయేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Mar 2025 03:24PM

Photo Stories