Skip to main content

JNV Entrance Exam Results : జేఎన్‌బీ ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు.. అందుబాటులో ఎంపిక జాబితా.. డౌన్‌లోడ్ విధానం ఇలా..

జ‌వ‌హార్ న‌వోద‌య విద్యాల‌య‌లో ప్ర‌వేశాలు పొందేందుకు ఎంపిక పరీక్ష నిర్వ‌హిస్తారు. ఈ విద్యాల‌యాల్లో 6, 9వ త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.
Jawahar navodaya vidhyalaya entrance test results 2025

సాక్షి ఎడ్యుకేష‌న్‌: జ‌వ‌హార్ న‌వోద‌య విద్యాల‌య‌లో ప్ర‌వేశాలు పొందేందుకు ఎంపిక పరీక్ష నిర్వ‌హిస్తారు. ఈ విద్యాల‌యాల్లో 6, 9వ త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. జేఎన్‌వీఎస్‌టీ 2025 ప‌రీక్ష‌కు హాజ‌రైన విద్యార్థులు వారి ఫ‌లితాల‌ను తెలుసుకునేందుకు జ‌వ‌హార్ న‌వోద‌య అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి. ఫ‌లితాల‌కు సంబంధించిన ఎంప‌క జాబితా పీడీఎఫ్‌ను వెబ్‌సైట్లో navodaya.gov.in. అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ డౌన్‌లోడ్ ప్రాసెస్‌.. 

ఏటా నిర్వ‌హించే జ‌వహార్ న‌వోద‌య 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాల‌తోపాటు 9వ త‌ర‌గ‌తి ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను కూడా అదే వెబ్‌సైట్‌లో విడుద‌ల చేశారు.

Inter Exams Valuation : కొన‌సాగుతున్న ఇంట‌ర్ ప‌రీక్ష‌ల మూల్యాంక‌నం.. జాగ్ర‌త్త‌లు పాటించాలి..

వెబ్‌సైట్స్‌:

navodaya.gov.in
cbseitms.nic.in
nvsadmissionclassnine.in

డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

1. అధికారిక వెబ్‌సైట్‌ని సంద‌ర్శించండి.. navodaya.gov.in.

2. జేఎన్‌వీఎస్‌టీ 6వ‌, 9వ త‌ర‌గ‌తి మెరిట్ జాబితా పీడీఎఫ్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఇక‌, పీడీఎఫ్ ప్ర‌ద‌ర్శ‌న అవుతుంది. దానిని, సేవ్ చేసి, డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.

KVS Draw of Lots Schedule : కేవీఎస్ ప్ర‌వేశాల‌కు లాట‌రీ ఫ‌లితాలు.. డ్రా ఆఫ్ లాట్స్ షెడ్యూల్ ఇలా..

జాబితాలో వివ‌రాలు..

జేఎన్‌వీఎస్‌టీ 6, 9వ త‌ర‌గ‌తి జాబితాలో.. విద్యార్థి పేరు, రోల్ నంబ‌ర్లు, మ‌రిన్ని ముఖ్య‌మైన వివ‌రాలు త‌దిత‌ర వివ‌రాలు ఉంటాయి.

జేఎన్‌వీఎస్‌టీ క్లాస్ 6, 9 ఫలితాలు 2025: అంచనా వేసిన కటాఫ్ మార్కులు
జేఎన్‌వీఎస్‌టీ క్లాస్ 6, 9 ఫలితాలు 2025 కోసం అంచనా వేసిన కటాఫ్ మార్కులు:

జనరల్ కేటగిరీ: 82 – 85
ఓబీసీ కేటగిరీ: 76 – 79
ఎస్సీ కేటగిరీ: 72 – 75
ఎస్టీ కేటగిరీ: 67 – 70

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Mar 2025 04:23PM

Photo Stories