Andhra Pradesh Debt: తెలుగు రాష్ట్రాల అప్పులు ఎంతో తెలుసా..?
Sakshi Education
ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

ఇవి జీఎస్‌డీపీలో 34.70% భాగంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఏపీ అప్పులు 34.58% జీఎస్‌డీపీతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్రానికి రూ.4,42,298 కోట్ల అప్పులు ఉన్నాయని కూడా పంకజ్ చౌదరి అన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 24వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.
అలాగే.. కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాల్లో 10,189 IT కంపెనీలు ప్రారంభమయ్యాయని, అయితే అదే సమయంలో 3,369 సంస్థలు మూతపడ్డాయని తెలిపారు. ఈ ఐటీ కంపెనీల ద్వారా గత 5 సంవత్సరాల్లో రూ.14,865 కోట్ల టర్నోవర్ వచ్చిందని ఆయన వివరించారు.
Our Schools and Our Future: మన బడి-మన బవిష్యత్తుకు రూ.407.91 కోట్లు
Published date : 25 Mar 2025 12:33PM