Francois Bayrou: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఫ్రాంకోయిస్ బైరూ
2024 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రి మారడం ఇది మూడోసారి. ఫ్రాన్స్‌లోని అధికార, విపక్షాలు కలిసి అవిశ్వాస తీర్మానంపై మూకుమ్మడిగా ఓట్లు వేయడంతో ఇటీవలే మైఖేల్ బార్నియెర్ దేశ ప్రధాని పదవిని కోల్పోయారు.
ఫ్రాంకోయిస్ బైరూ ఎవరు?
ఈయన డెమొక్రటిక్ మూవ్‌మెంట్ పార్టీ వ్యవస్థాపకుడు. అధ్యక్షుడు మక్రాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార కూటమిలో 2017 సంవత్సరం నుంచి ఈ పార్టీ మిత్రపక్షంగా ఉంది. గతంలో ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి మూడుసార్లు ఫ్రాంకోయిస్ పోటీ చేశారు. 2017లో ఈయనను ఫ్రాన్స్ న్యాయశాఖ మంత్రిగా మక్రాన్ నియమించారు.
అయితే, బైరూ నాయకత్వంలోని పార్టీపై పార్లమెంటరీ అసిస్టెంట్ల నియామకాల్లో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదురయ్యాయి. దీంతో ఫ్రాంకోయిస్ బేరౌ మంత్రిగా ఉన్నప్పుడు రాజీనామా చేశారు. అయితే, దర్యాప్తులో ఆయనపై ఆరోపణలు నిరాధారంగా తేలాయి, ఆయనపై ఎలాంటి తప్పులు చేయలేదని స్పష్టం అయింది.