Skip to main content

Drug Crimes: దారుణం.. నలుగురు కెనడా పౌరులకు ఉరిశిక్ష

డ్రగ్స్‌ సంబంధిత ఆరోపణలపై తమ నలుగురు పౌరులకు చైనా ప్రభుత్వం ఇటీవల ఉరిశిక్ష అమలు చేసిందని కెనడా వెల్లడించింది.
China Executes Four Canadians for Drug Crimes

ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించింది. ద్వంద పౌరసత్వం ఉన్న ఈ నలుగురికీ క్షమాభిక్ష ప్రకటించాలని మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రూడో, తాను గతంలో చైనాను కోరినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జోలీ మార్చి 20వ తేదీ చెప్పారు.  

ఈ ఘటనపై ఒట్టావాలోని చైనా ఎంబసీ ప్రతిస్పందించింది. చైనా తన ప్రభుత్వానికి ద్వంద పౌరసత్వాన్ని గుర్తించదని, డ్రగ్‌ సంబంధిత నేరాలపై వారు ఉరి శిక్షను అమలు చేశారని పేర్కొంది. ఈ రకమైన నేరాలకు చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, నలుగురు పౌరులపై ఆరోపణలకు పటిష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. కెనడా ప్రభుత్వానికి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయకుండా, తమ ప్రభుత్వ విధానాన్ని గౌరవించాలని అభ్యర్థించింది.

Made in Russia: చైనాలో పెరుగుతున్న రష్యన్‌ ఉత్పత్తుల క్రేజ్!

అలాగే, డ్రగ్‌ స్మగ్లింగ్‌ కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న కెనడా పౌరుడు రాబర్ట్‌ షెల్లెన్‌బర్గ్‌ విషయంలో కూడా చైనాకు క్షమాభిక్ష ఇవ్వాలని కెనడా ప్రభుత్వం కోరినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జోలీ వెల్లడించారు.

ఈ పరిణామాలు చైనా-కెనడా మధ్య మరింత ఉద్రిక్తతలను సృష్టించాయి. 2018లో కెనడా హువై మాజీ చీఫ్‌ను అరెస్ట్‌ చేసినప్పటి నుండి, చైనా-కెనడా సంబంధాలు ఉద్రిక్తతల మధ్య ఉన్నాయ్. ఆ తర్వాత కెనడా చైనాకు కొన్ని టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో చైనా ప్రతిగా కెనడా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించింది. ఈ వాణిజ్య యుద్ధం కెనడా-చైనా సంబంధాలను మరింత సున్నితంగా మార్చింది.

QS Rankings: ప్రపంచవ్యాప్తంగా.. టాప్ 50 విద్యాసంస్థల్లో 9 భారతదేశానివే.. ఆ విద్యాలయాలు ఇవే..

Published date : 21 Mar 2025 03:14PM

Photo Stories