Happiest Countries: సంతోషంలో పాలస్తీనా, ఉక్రెయిన్ కన్నా వెనుకబడ్డ భారత్!!

తాజా ప్రపంచ ఆనందమయ దేశాల నివేదిక 2025 ప్రకారం.. ఫిన్లాండ్ ఈ గౌరవాన్ని వరసగా ఎనిమిదోసారి అందుకుంది. ఈ నివేదికలో దేశాల వృద్ధి, పౌరుల మధ్య సంబంధాలు, సామాజిక మద్దతు, అవినీతి స్థాయి, ఆత్మ సంతృప్తి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు నిర్ధారించబడ్డాయి.
ప్రపంచ ఆనందం - 2025 నివేదిక
ఈ నివేదిక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లోని వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో తయారు చేయబడింది. దానిలో గాలప్ మరియు అమెరికా సుస్థిరాభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్ సహకరించారు. ఈ నివేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ జీవితాలకు ఎంత రేటింగ్ ఇచ్చారో, ఇతర దేశాల్లో ప్రజల ఆనంద స్థితిని వివరించే అంశాలు కూడా ప్రస్తావించబడ్డాయి.
భారత్ 118వ ర్యాంక్
గత సంవత్సరానికి 126వ ర్యాంక్ తో పోలిస్తే భారత్ ఈ ఏడాది 118వ ర్యాంక్ సాధించింది. అయితే, భారత్ కు పొరుగున ఉన్న చైనా 68వ, నేపాల్ 92వ, పాకిస్తాన్ 109వ స్థానాల్లో నిలిచాయి. ఆసియా ఖండంలోనే భారత పక్కనే ఉన్న పాలస్తీనా (108వ), ఉక్రెయిన్ (111వ) కూడా భారత్ కంటే మెరుగైన స్థానాలను అందుకున్నాయి.
QS Rankings: ప్రపంచవ్యాప్తంగా.. టాప్ 50 విద్యాసంస్థల్లో 9 భారతదేశానివే.. ఆ విద్యాలయాలు ఇవే..
అమెరికా 24వ ర్యాంక్
ప్రపంచంలో అగ్రరాజ్యంగా ప్రఖ్యాత అమెరికా ర్యాంకుల్లో కాస్త దిగివేసింది. 13 ఏళ్ల క్రితం 11వ ర్యాంక్ లో ఉన్న అమెరికా ఇప్పుడు కేవలం 24వ ర్యాంక్ వద్ద నిలిచింది. అయితే, ఈ స్థితి సామాజిక, ఆర్థిక పరిణామాలతో సంబంధం కలిగి ఉంటుంది.
టాప్– 10 దేశాలు ర్యాంకులలో..
- ఫిన్లాండ్
- డెన్మార్క్
- ఐస్‌లాండ్
- స్వీడన్
- నెదర్లాండ్స్
- కోస్టారికా
- నార్వే
- ఇజ్రాయెల్
- లక్సెంబర్గ్
- మెక్సికో
కోస్టారికా, మెక్సికోలు టాప్– 10లో నిలవడం ఇదే తొలిసారి..
భారతదేశం, దాని పొరుగుదేశాలు
- భారత్ – 118వ
- పాకిస్తాన్ – 109వ
- నేపాల్ – 92వ
- చైనా – 68వ
- శ్రీలంక – 133వ
- బంగ్లాదేశ్ – 134వ
ప్రముఖ దేశాలు - ఫలితాలు
- ఇజ్రాయెల్ - 8వ ర్యాంక్
- అమెరికా - 24వ ర్యాంక్
- అఫ్గానిస్తాన్ - 147వ ర్యాంక్