PD Singh: స్టాండర్డ్ చార్టర్డ్ ఇండియా సీఈఓగా పీడీ సింగ్
Sakshi Education
స్టాండర్డ్ చార్టర్డ్ ఇండియా సీఈఓగా ప్రబ్‌దేవ్ సింగ్ నియమితులయ్యారు.

స్టాండర్డ్ చార్టర్డ్ ఇండియా సంస్థ.. పీడీ సింగ్‌ను తన తదుపరి ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO)గా నియమించింది. ఈ నియామకం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
- జారిన్ దరువాలా స్థానంలో పీడీ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. దరువాలా మార్చి 31వ తేదీ పదవీ విరమణ చేయనున్నారు.
- సింగ్‌కు బ్యాంకింగ్‌లో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్ భారతదేశ సీఈఓగా పనిచేసినప్పుడు, బ్యాంక్ యొక్క కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
- జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌కు ముందు సింగ్ హెచ్ఎస్‌బీసీలో కార్పొరేట్, వాణిజ్య బ్యాంకింగ్ విభాగాలలో నాయకత్వ స్థానాల్లో పనిచేశారు. అక్కడ ఆయన దశాబ్దం కాలం పాటు పనిచేశారు.
- స్టాండర్డ్ చార్టర్డ్ భారతదేశంలో 165 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఒక పురాతన బ్యాంకు. ప్రస్తుతం దీనికి దేశవ్యాప్తంగా 100 శాఖలు ఉన్నాయి.
High Court of Telangana: హైకోర్టులో ముగ్గురు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా
Published date : 19 Feb 2025 09:18AM