Skip to main content

Goias Hub: స్టార్టప్‌ల‌కు తెలంగాణ ప్రభుత్వం.. ఆ దేశంతో కీలక ఒప్పందం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
Telangana Govt inks MoU with Brazil's GOIAS Hub to promote startups

బ్రెజిల్‌కు చెందిన గోయాస్ హబ్‌తో టీ హబ్ అవగాహన ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో (హెచ్ఐసీసీ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫిబ్ర‌వ‌రి 18వ తేదీ గోయాస్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 

అనంతరం టీ హబ్ ఫౌండేషన్ సీఈవో సుజిత్ గోయాస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ఫ్రెడెరికో లైరా నెట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టర్లకు బ్రెజిల్‌లో, అక్కడి స్టార్టప్‌లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. 

ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రిటెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారానికి వీలు కలుగుతుంది. మార్కెట్ యాక్సెస్రోపాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై రెండు సంస్థలు కలిసి పని చేస్తాయి.

Telangana's Caste Survey: తెలంగాణలో సామాజిక వర్గాల వారీగా జనాభా ‘లెక్క’

Published date : 20 Feb 2025 09:17AM

Photo Stories