Caste Survey: తెలంగాణలో సామాజిక వర్గాల వారీగా జనాభా ‘లెక్క’

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 'సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే' (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) గణాంకాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 2వ తేదీ వెల్లడించారు. ఈ సర్వే గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సర్వేలో కొన్ని ముఖ్యమైన వివరాలు, గణాంకాలు ఇవే..
జనాభా లెక్క:
రాష్ట్రంలో మొత్తం 3.7 కోట్లు జనాభా ఉన్నట్లు అంచనా.
అందులో 3.54 కోట్ల మంది మీద సర్వే జరిగింది, మిగిలిన 16 లక్షల మందికి సంబంధించి వివరాలు సేకరించలేదు.
సర్వే చేసిన జనాభా: పురుషులు - 1.79 కోట్లు, మహిళలు - 1.75 కోట్లు, థర్డ్ జెండర్ - 13,774.
Welfare Schemes: తెలంగాణలో నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అమలు.. ఆ పథకాలు ఇవే..
సామాజిక వర్గాల వారీ జనాభా ఇదే..
బీసీలు: 46.25%
షెడ్యూల్డ్ కులాలు: 17.43%
ఓసీలు: 13.31%
ముస్లిం మైనార్టీలు: 12.56%
షెడ్యూల్డ్ తెగలవారు: 10.45%
ముస్లిం మైనార్టీలలో 2.48% ఓసీ కేటగిరీకి చెందినవారు. దీనితో ఓసీ కేటగిరీ జనాభా మొత్తం 15.79% గా ఉంది.
సర్వేలో పాల్గొనని కుటుంబాలు..
- మొత్తం 1,15,17,457 కుటుంబాలున్నాయి.
- 1,12,15,134 కుటుంబాల వివరాలు సేకరించబడ్డాయి.
- సుమారు 3 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమాచారం సేకరించలేదు.
- అందులో 1.03 లక్షల ఇళ్లు తాళం వేసి ఉండగా,
- 1.68 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు.
- మిగతా కుటుంబాలు వలస కార్మికులుగా ఉన్నారు.
సర్వే స్థాయిలు..
- సర్వే కచ్చితత్వం 96.9%గా అంచనా.
- 94,863 ఎన్యుమరేటర్లు, 9,628 సూపర్‌వైజర్లు, 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు సర్వే డేటా సేకరణలో పాల్గొన్నారు.
Coal Mining: నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి.. 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం