Flood Relief: తెలుగు రాష్ట్రాలకు వరద సాయం.. ఈ రాష్ట్రాలకు కూడా..

ఇందులో కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్‌కు రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్లు వరద సాయంగా ప్రకటించింది. 2024 సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో.. విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాలు, తెలంగాణలో.. ఖమ్మం జిల్లా వరదలకు గురైంది. ఈ వరదల కారణంగా జరిగిన నష్టాలను సరిదిద్దే ప్రక్రియలో కేంద్ర హోంశాఖ అమిత్‌షా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఫిబ్రవరి 19వ తేదీన ఈ సాయాన్ని ఆమోదించింది.
ఇందులో మొత్తం.. ఐదు రాష్ట్రాలకు రూ.1,554.99 కోట్ల సాయం అందించాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైన వాటా దక్కింది. ఇలాగే, ఒడిశాకు రూ.255.24 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు వరద సాయం ప్రకటించారు.
అదనంగా, గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రకృతి వైపరీత్య స్పందన నిధి(State Disaster Response Fund) నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు సాయం అందింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు మంజూరు చేయబడ్డాయి. ఈ మొత్తాలను అదనంగా కేంద్రం మరోసారి విడుదల చేసింది.