Jaishankar: జైశంకర్‌కు నేషనల్ ఎమినెన్స్ అవార్డు
పబ్లిక్ లీడర్‌షిష్ విభాగంలో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ (SIES) ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేసింది. ప్రజా నాయకత్వంలో జైశంకర్ చేసిక కృషికి ఈ అవార్డు ఇస్తున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. ప్రజా నాయకత్వంలో చేసిన విశిష్ట కృషికి జైశంకర్ ఈ అవార్డు పొందారు.
జైశంకర్ మాట్లాడుతూ.. ఎస్ఐఈఎస్ సంస్థ దేశంలోని పురాతన విద్యా సంఘాలలో ఒకటిగా నిలిచిందని, తనకు ఈ అవార్డు ప్రదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మహా పెరియవర్ చేసిన అంతర్జాతీయ సేవలను గుర్తు చేసుకున్నారు. పెరియవర్ ప్రపంచ వేదికపై భారతదేశం గొప్పదనాన్ని నిలబెట్టారని ఆయన పేర్కొన్నారు.
జైశంకర్ 1966లో డా.ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఆలపించిన "మైత్రీమ్ భజత" అనే సార్వత్రిక సామరస్య గీతం రచించారని గుర్తు చేసుకున్నారు.
Order of Mubarak Al Kabeer: మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం
ప్రస్తుతం, భారతదేశం ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, స్వతంత్ర శక్తిగా స్థిరపడుతోందని, ప్రపంచ దేశాల్లో శాంతి స్థాపనకు కృషి చేస్తోందని జైశంకర్ చెప్పారు. ఆయన వివరించినట్లు, శ్రీ అన్న (మిల్లెట్స్) ని పునరుజ్జీవింపజేయడం, యోగా ను ప్రపంచదేశాల్లో ప్రాచుర్యం చేయడం వంటి చర్యలు భారత ప్రభుత్వం చేపడుతోంది.
ఎస్ఐఈఎస్ సంస్థ ప్రతి సంవత్సరం పబ్లిక్ లీడర్‌షిప్, హ్యూమన్ ఎండీవర్, సోషల్ లీడర్‌షిప్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో ఈ అవార్డు ప్రదానం చేస్తుంది.